: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపై కేసు నమోదు... 8 మంది అనుచరుల అరెస్ట్


వైసీపీ నేత, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన మరుక్షణమే రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు ఆయన అనుచరుల్లోని 8 మందిని అరెస్ట్ చేశారు. దీంతో గుంటూరులో కలకలం రేగింది. కేసు వివరాల్లోకెళితే.... గుంటూరులోని చంద్రబాబునాయుడు కాలనీలో టీడీపీ సర్కారు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముస్తఫా నేతృత్వంలోని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. దీనిపై టీడీపీ నేతల నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు... ఘటనపై మరిన్ని వివరాలు సేకరించి ముస్తఫాపై కేసు నమోదు చేశారు. ఇక శిలాఫలకం ధ్వంసం ఘటనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ముస్తఫా అనుచరుల్లోని 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News