: అంతా అసత్యం... నేనేమీ రెచ్చగొట్టలేదు: కేంద్ర మంత్రి రాంశంకర్


ఆగ్రాలో తాను ముస్లింలపై దాడులు చేయాలని పిలుపునిచ్చినట్టు వచ్చిన వార్తలపై కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కథేరియా తీవ్రంగా స్పందించారు. అంతా అసత్యమని, తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. "ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనం అవాస్తవం. ఆ కార్యక్రమాన్ని చూసి వార్త రాసుండాల్సింది. నా ప్రసంగం మొత్తం వినకుండానే ఇలాంటి ఆరోపణలు ఎలా రాస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. కాగా, వీహెచ్పీ కార్యకర్త అరుణ్ మహుర్ అనే వ్యక్తి, పూజలు ముగించుకుని వస్తున్న వేళ, కొందరు ముస్లిం యువత అడ్డగించి కొట్టి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో అరుణ్ సంస్మరణ సభకు హాజరైన రాంశంకర్ పరుష పదజాలాన్ని వాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని వార్తలు వెలువడ్డాయి. అందరూ కలసి ఓ తేదీ అనుకుని, ముస్లింలపై పడాలని ఆయన అన్నట్టు సమాచారం. అయితే, తానేమీ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని కథేరియా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News