: రిలయన్స్ 'లైఫ్' వచ్చేసింది!


రిలయన్స్ డిజిటల్ నుంచి 4జీ సౌకర్యంతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండే సరికొత్త 'లైఫ్' సిరీస్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. లైఫ్ ఫ్లేమ్ 1, లైఫ్ విండ్ 6 పేరిట వివిధ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ. 6,490, రూ. 7,090 అని సంస్థ వెల్లడించింది. లైఫ్ ఫ్లేమ్ 1లో 4.5 అంగుళాల స్క్రీన్, 1.1 జీహెచ్ ప్రాసెసర్, 5/5 ఎంపీ కెమెరాలు, 1 జీబీ రామ్, 8 జీబీ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీలుంటాయని, లైఫ్ విండ్ 6లో 5 అంగుళాల డిస్ ప్లే, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని, మిగతా ఫీచర్లన్నీ రెండు ఫోన్లలో ఒకటేనని సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News