: నితీశ్ జీ... విష్ యూ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్: రాజకీయ ప్రత్యర్థికి మోదీ బర్త్ డే గ్రీటింగ్స్


ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్... ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. అయితే బీహార్ ప్రజలు సౌమ్యుడైన నితీశ్ కే పట్టం కట్టారు. మోదీకి షాకిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. అయితే ఇలాంటి రాజకీయ విభేదాలను ప్రధాని మోదీ పక్కనపెట్టేశారు. నేడు బర్త్ డే జరుపుకుంటున్న నితీశ్ కుమార్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీ... నితీశ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘బర్త్ డే విషెస్ టూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ జీ. మే హీ బి బ్లెస్డ్ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్’’ అంటూ నితీశ్ కు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మోదీ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News