: ఆసుపత్రిలో మెడికల్ స్టాఫ్ చిందులు!... సోషల్ మీడియాలో వీడియో వైరల్


అదో ఆసుపత్రి. బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. అనారోగ్యంతో రోగులు మూలుగుతున్నారు. అయితే ఇవేమీ పట్టని ఆసుపత్రి సిబ్బంది అక్కడే ఓ మ్యారేజీ పార్టీ చేసుకున్నారు. మ్యారేజీ పార్టీ అంటే విందు భోజనాలు కాదు. చిందులాటలు. ఓ పక్క రోగులు సహాయం కోసం అర్థిస్తున్నా, పట్టని వైద్య సిబ్బంది బాలీవుడ్ హిట్ సాంగులు పెట్టుకుని చిందుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా?... దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలోని బులంద్ షహర్ లోని ఓ ఆసుపత్రిలో. వైద్య సిబ్బంది అంతా డ్యాన్సుల్లో మునిగితేలిన వైనంపై ఓ రోగి బంధువు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెద్ద సంఖ్యలో రోగులు సహాయం కోసం అర్థిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడంటూ ఆ వ్యక్తి వాపోయాడు.

  • Loading...

More Telugu News