: బాబు గారూ... మీది కూడా కేసీఆర్ వైఖరేగా!: చంద్రబాబును నిలదీసిన మోత్కుపల్లి


టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఝలకిచ్చారట. పార్టీ ఫిరాయింపులపై నోరు విప్పిన మోత్కుపల్లి... తెలంగాణ లో కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరినే మీరూ అనుసరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను కాస్తంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. వివరాల్లోకెళితే... నిన్న విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నేతలతో పాటు టీ టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకింత నిరసన గళం విప్పిన మోత్కుపల్లి ‘‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ది, మీది ఒకే విధానం’’ అని అన్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలకు తొలుత స్పందించని చంద్రబాబు నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత ‘‘పార్టీ ఫిరాయింపులు ఇప్పుడేమీ కొత్త కాదు. ఏన్నో ఏళ్లుగా కొనసాగుతున్నదే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News