: అమెరికాలో బాల ఉన్మాది!... పాఠశాలలో తుపాకీతో స్వైర విహారం, నలుగురికి గాయాలు
అమెరికాలో గన్ కల్చర్ కు చెక్ పడటం లేదు. నిన్నటిదాకా ఉన్మాదులుగా మారిన యువకులు పేట్రేగితే, తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు తుపాకీతో పాఠశాలలో స్వైర విహారం చేశాడు. తుపాకీ చేతబట్టుకుని పాఠశాలలోకి ప్రవేశించిన ఆ బాలుడు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అమెరికాలోని ఒహాయోలో కొద్దిసేపటి క్రితం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి ఉన్మాదంతో ఊగిపోయిన ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.