: లక్ష కోట్లు కాదు... రూ.6 లక్షల కోట్లు!: జగన్ అక్రమాస్తులపై ఆదినారాయణరెడ్డి సంచలన కామెంట్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడబెట్టింది అక్షరాలా లక్ష కోట్ల రూపాయలంటూ ప్రతిపక్షాలు తరచుగా చేస్తున్న విమర్శలు మనకు తెలిసిందే. అయితే జగన్ అక్రమాస్తుల విలువ రూ.లక్ష కోట్లు మాత్రమే కాదట. వాటి విలువ ఏకంగా రూ.6 లక్షల కోట్లట. ఈ మేరకు నిన్నటిదాకా జగన్ పార్టీలోనే ఉండి, ఇటీవలే టీడీపీలో చేరిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిన్న సంచలన కామెంట్లు చేశారు. జగన్ సొంతూరు పులివెందులలోని పూల అంగళ్ల ముందే జగన్ చిట్టా మొత్తం విప్పుతానని కూడా ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన సొంత నియోజకవర్గ కేంద్రంలో నిన్న జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ... తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ నాడు లక్ష కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమార్జనకు రూపాయి వడ్డీ వేసినా... వాటి విలువ రూ.6 లక్షలు అవుతుందని ఆయన ఆరోపించారు. జగన్ కు చెక్ పెట్టేందుకే తాను టీడీపీలో చేరానని కూడా ఆదినారాయణరెడ్డి ప్రకటించారు.

  • Loading...

More Telugu News