: నయా 'లుక్'లో దర్శనమిచ్చిన కేటీఆర్!
తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నయాలుక్ లో దర్శనమిచ్చారు. తెలంగాణలోని రాజకీయనాయకుల్లో కేసీఆర్ తరువాత హరీష్ రావు, కేటీఆర్ లకు విశేషమైన ఆదరణ ఉంది. వారిని అనుసరించే అభిమానుల సంఖ్య భారీగానే ఉంటుంది. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల వరకు నిర్విరామంగా గడిపిన కేటీఆర్, తాజాగా ప్రశాంతంగా కనిపించారు. ఆహార్యంలో యువతకు ప్రతినిధిలా కనిపించిన కేటీఆర్ హెయిర్ స్టైల్ మార్చారు. ఇంతవరకు జుట్టును వెనుకకు నీట్ గా దువ్వుకుని కనిపించిన కేటీఆర్, తాజాగా తండ్రిలా పక్కకు దువ్వుకుని కనిపించారు. అంతే కాకుండా తండ్రిలాగే చుట్టూ అధికారులను కూర్చోబెట్టుకుని సమావేశం నిర్వహించిన కేటీఆర్, వారి సూచనలు జాగ్రత్తగా వింటూ కనిపించారు. దీంతో ఆయన కొత్త లుక్ పై పలువురు చర్చించుకుంటున్నారు.