: యూఏఈ బాగానే ఆడింది...పాక్ లక్ష్యం 130


ఆసియాకప్ లో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనబడే ఏకైక జట్టు యూఏఈ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి యూఏఈపై పాకిస్థాన్ బౌలర్లు ప్రభావం చూపలేకపోవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దీంతో పాక్ పేస్ బౌలర్లు రెచ్చిపోయారు. వారి బంతుల ధాటికి తొలి మూడు వికెట్లను స్వల్ప వ్యవధిలోనే యూఏఈ కోల్పోయింది. దీంతో యూఏఈ స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే, ఆ తర్వాత పుంజుకున్న యూఏఈ బ్యాట్స్ మన్ పాక్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు. షైమన్ అన్వర్ (46), మహ్మద్ ఉస్మాన్ (21), అంజాద్ జావెద్ (27), మహ్మద్ నవీద్ (10) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో యూఏఈ జట్టు 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్, మహ్మద్ ఇర్ఫాన్ చెరి రెండు వికెట్లు తీసి రాణించగా, మహ్మద్ షమి, షాహిద్ అఫ్రిదీ చెరో వికెట్ తో వారికి చక్కని సహకారం అందించారు. 130 పరుగుల విజయలక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News