: తొలి ఏడాది లోటు బడ్జెట్ నిధులే ఇంకా రాలేదు...నిల్వలు తరిగిపోతున్నాయి: యనమల


బెజవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విభజన జరిగిన తొలి ఏడాది లోటు బడ్జెట్ నిధులే ఇంతవరకు పూర్తి స్థాయిలో విడుదల కాలేదని అన్నారు. లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికలోటు అంతకంతకూ పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగితే రాష్ట్రం మరింత అధోగతిపాలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థత కారణంగా కష్టాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఎలాగోలా లాక్కొస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం కేటాయింపులపై ఏమాత్రం సంతోషంగా లేమని ఆయన అన్నారు. మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం కాస్త ఆందోళనకరమేనని పోలిట్ బ్యూరో అభిప్రాయపడినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రానికి నిధులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News