: ఆయన సవాళ్లు విసురుతూ వుంటే మేం చూస్తూ ఉండాలా?: జగన్ పై లోకేశ్ ఆగ్రహం


ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తొమ్మిదిసార్లు బహిరంగంగా ప్రకటించారని, ఆయన అలా సవాళ్లు విసురుతూ వుంటే తాము చూస్తూ ఉండాలా? అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన వివిధ అంశాలపై స్పందించారు. తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నవారు, గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరినవారితో రాజీనామా చేయించారా? అని అడిగారు. కేసులు, ఛార్జిషీట్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ పార్టీని ఏం నడిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల విషయంలో అధిష్ఠానందే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేయాల్సిన పని చాలా ఉందని చెప్పిన ఆయన, ఇప్పుడే రాజ్యసభకు వెళ్లే ఆలోచన తనకు లేదని ఆయన తెలిపారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News