: రేపటి మ్యాచ్ కు ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి?
ఆసియాకప్ లో భాగంగా రేపు సాయంత్రం శ్రీలంకతో ఆడనున్న భారత జట్టు కీలక ఆటగాళ్లు ముగ్గురు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెన్నునొప్పితో బాధపడుతుండగా, రోహిత్ శర్మ పాదం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నేడు ప్రాక్టీస్ సెషన్ కు కూడా రోహిత్ హాజరుకాలేకపోయాడు. గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టీట్వంటీ ఆడని సంగతి తెలిసిందే. అయితే నేడు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో ధావన్ ప్రాక్టీస్ చేయడంతో అతను గాయం నుంచి కోలుకున్నాడన్న సంకేతాలు వెలువడ్డాయి. రోహిత్ రాకపోవడంతో పార్థివ్ పటేల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దీంతో రేపు శ్రీలంకతో వీరు ఆడే విషయంపై ఇదమిత్థంగా తెలియడం లేదు. మరి, ధోనీ వ్యూహం ఏమిటనేది తెలియాల్సి ఉంది.