: యూనివర్సిటీలు పవిత్రమైనవి...ఉన్నతంగా తీర్చిదిద్దండి: వీసీలకు బాబు సూచన


యూనివర్సిటీలు పవిత్రమైనవని వాటిని ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీల వైస్ ఛాన్సెలర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీ సీఎంవోలో యూనివర్సిటీల వీసీలతో సమావేశమైన సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులకు భవిష్యత్ దిశానిర్దేశం చేసేలా యూనివర్సిటీలు స్పూర్తినివ్వాలని ఆయన సూచించారు. గతంలో యూనివర్సిటీలకు ఉన్న చెడ్డ పేరును తొలగించుకుని సరికొత్తగా పయనం ప్రారంభించాలని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం, జలవనరుల పెంపకం వంటి అంశాలపై బహిరంగ చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంచాలని ఆయన కోరారు. నిర్మాణాత్మక నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యూనివర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. యూనివర్సిటీలను మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకే సెనేట్లలో పారిశ్రామిక వేత్తలకు స్థానం కల్పించామని ఆయన చెప్పారు. వీటన్నింటికీ వీసీలు సహకరించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News