: సరిగ్గా అదే రోజు నా భర్తను కలిశాను: అసిన్


ప్రముఖ సినీ నటి అసిన్ తన భర్త రాహుల్ శర్మను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం మైక్రో మ్యాక్స్ ఆసియాకప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మైక్రో మ్యాక్స్ సహవ్యవస్థాపకుడైన రాహుల్ శర్మ టోర్నీ నిర్వాహకుడి హోదాలో భారత్, పాక్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఆ మ్యాచ్ చూసేందుకు అసిన్ బంగ్లాదేశ్ వెళ్లింది. ఈ సందర్భంగా తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని అసిన్ తెలిపింది. తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ను చూసేందుకు వీరిద్దరూ బంగ్లాదేశ్ వెళ్లారు. మ్యాచ్ ను వీక్షించి, అప్పటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నామని అసిన్ తెలిపింది. ఈ సందర్భంగా తన భర్త రాహుల్ శర్మతో కలిసి ఉన్న ఫోటోను అసిన్ ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News