: గూగుల్ లో ప్రియాంక కోసం వెతికారు!


ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని తన అందచందాలతో హాలీవుడ్ నటులు, ప్రేక్షకులను సైతం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆకర్షించింది. ఓ రకంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఆమె నిలిచిందని చెప్పాలి. దాంతో గూగుల్ లో ఆమె కోసం పిచ్చిగా వెతికేశారట. ఇవాళ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న లియోనార్డో డికాప్రియో తరువాత భారత్ నుంచి పీసీ కోసమే ఎక్కువగా వెతికారని ఓ ప్రకటనలో గూగుల్ వెల్లడించింది. దాంతో ఆస్కార్ పురస్కారాల కోసం చేసిన వెతుకులాటలో ఆమె రెండో సెలబ్రిటీగా నిలిచినట్టు తెలిపింది. అంతేగాక ఆస్కార్ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు కోసం కూడా భారత్ నుంచి గూగుల్ లో మరింతగా వెతికారని వివరించింది. ముఖ్యంగా ఉత్తమ నటుడి కేటగిరీ నామినీగా భారత్, యూఎస్ అభిమానులు ఎక్కువగా డికాప్రియోనే వెతికారని వివరించింది.

  • Loading...

More Telugu News