: మల్టీస్టారర్ అనగానే ఇగోలుంటాయి...కార్తీతో అలాంటివి లేవు: నాగార్జున
సినీ నటుడు కార్తీ మంచి నటుడే కాకుండా మంచి మనిషి అని అగ్రనటుడు నాగార్జున ప్రశంసించారు. తాజాగా తాను నటించిన 'ఊపిరి' సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, మల్టీస్టారర్ సినిమాలంటే పాటలు, ఫైట్లు, ఇమేజ్ అంటూ హీరోల మధ్య పలు ఇగో సమస్యలు తలెత్తుతాయని, అయితే 'ఊపిరి' సినిమాలో సహనటుడు కార్తీతో తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని నాగ్ చెప్పారు. ఈ సినిమాతో తమిళనాట 'తొళ' అని ముద్దుగా పిల్చుకునే కార్తీ తనకు సోదరుడిగా మారాడని నాగార్జున తెలిపారు. నటుల్లో ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను చూడడం జరగదని కార్తీకి ఆయన కితాబునిచ్చారు. అయితే ఈ సినిమాలో కార్తీ, తమన్నా కలిసి తనను వీల్ చైర్లో కూర్చోబెట్టి, వాళ్లేమో హాయిగా డ్యూయెట్లు పాడుకున్నారని ఆయన చమత్కరించారు.