: యూట్యూట్ వినియోగదారులకు అందుబాటులో బ్లర్ టూల్


యూట్యూబ్ తన వినియోగదారుల కోసం బ్లర్ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూల్ ద్వారా వీడియోలో వేటినైతే ఎడిట్ చేయాలనుకున్నారో వాటిని బ్లర్ చేయవచ్చు. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ తీసే వారు, వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవారికి బ్లర్ టూల్ తో చాలా ఉపయోగం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ లో చాలా మంది వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. గతంలో యూట్యూబ్ వినియోగదారులకు బ్లర్ టూల్ అందుబాటులో లేదు. దీంతో వారు అప్ లోడ్ చేసిన వీడియోలో దృశ్యాలను సెన్సార్ చేయడం కుదిరేది కాదు. ఇకపై యూట్యూబ్ వినియోగదారులకు ఆ సమస్య ఉండదు.

  • Loading...

More Telugu News