: ప్రియాంకా చోప్రాపై ప్రశంసలు కురిపించిన అనుపమ్ ఖేర్
ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసలు కురిపించాడు. ఆస్కార్ వేదికపై నుంచి విజేతకు అవార్డు అందించిన తొలి భారతీయ నటిగా ప్రియాంకా చోప్రా పేరు తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ ప్రియాంకా...ఈ ప్రయాణం ఇలాగే సుదూరం సాగాలంటూ ఆయన ట్వీట్ ద్వారా ఉత్తేజం నింపారు. కాగా, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రియాంకా చోప్రా అక్కడి నుంచి 'బేవాచ్' సినిమాలో నటించేందుకు మియామీకి బయల్దేరినట్టు ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక నటిస్తున్న తొలి హాలీవుడ్ సినిమా 'బేవాచ్' కావడం విశేషం.