: బడ్జెట్ అద్భుతంగా ఉంది: ప్రధాని మోదీ
2016-17 వార్షిక బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. వ్యవసాయ రంగానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దపీట వేశామన్నారు. మహిళలు, రైతులు, గ్రామాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. బడ్జెట్ లో గృహ నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, తద్వారా ప్రజల సొంతింటి కల సాకారమయ్యే అవకాశముందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలేనని, తాను ఈ విషయాన్ని పట్టించుకోనని మోదీ పేర్కొన్నారు.