: బుల్లి కేజ్రీవాల్ ను చూసి ముచ్చటపడ్డ అసలు కేజ్రీ!... మీరూ చూడండి!


అచ్చు గుద్దినట్టు తనలాగే తయారై వచ్చిన ఓ బుడతడిని చూసి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముచ్చటపడ్డాడు. ఈ ఉదయం పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన అగర్వాల్ సమాజ్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నలుపు రంగు ప్యాంటు, లోపల లేత నీలం రంగు షర్ట్, పైన ఎరుపు టీషర్ట్ ధరించి, తలపై టోపీ పెట్టుకోవడమే కాకుండా, కేజ్రీవాల్ మాదిరిగానే కళ్లద్దాలు, మీసాలు ధరించి వచ్చిన ఓ బుడతడు అందరినీ ఆకర్షించాడు. ఆ పిల్లాడిని చూసిన కేజ్రీవాల్ సైతం దగ్గరకు పిలిచి, చంకనెత్తుకుని ముద్దాడారు. బుల్లి కేజ్రీ, పెద్ద కేజ్రీలు ఉన్న చిత్రం మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News