: తండ్రి బడ్జెట్ పై స్పందించిన సోనాలీ!


ఈ ఉదయం పార్లమెంట్ లో 2016-17 ఆర్థిక బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తరువాత ఆయన కుమార్తె సోనాలీ స్పందించారు. తన భర్తతో కలిసి నేడు పార్లమెంట్ కు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రికి నూటికి నూరు మార్కులూ వేస్తున్నట్టు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను, ప్రజలను ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆయన భాగస్వామ్యం చేశారని తెలిపారు. అన్ని విభాగాలకూ కేటాయింపులు పెంచిన తన తండ్రికి అభినందనలు చెబుతున్నానన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సైతం బడ్జెట్ బాగుందని కితాబు ఇచ్చారు. జైట్లీ బడ్జెట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని పొగిడారు. రోడ్ల నిర్మాణానికి దేశ చరిత్రలోనే తొలిసారిగా లక్ష కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం అభివృద్ధికి సహకరిస్తుందని రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News