: ప్రొద్దుటూరు సైన్స్ ఫెయిర్ లో పేలుడు... పలువురికి గాయాలు!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇక్కడి శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తుండగా, ఓ పెట్రోల్ పరికరం పేలింది. పెట్రోలుతో నింపిన ఓ పరికరంపై ప్రయోగాన్ని చేసి చూపిస్తుండగా ఈ ఘటన జరిగింది. పేలుడుతో, అక్కడే ఉన్న 10 మంది చిన్నారులపై పెట్రోల్ పడడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. పెట్రోల్ గాయాలు కావడంతో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్కూలు పరిసరాల్లో విషాదం నెలకొని సైన్స్ ఫెయిర్ ఆగిపోగా, ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.