: భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
2016-17 సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ను జైట్లీ కొద్దిసేపటి క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ ప్రసంగం చేసిన జైట్లీ... బడ్జెట్ లో పొందుపరచిన పలు కీలక అంశాలను ఏకరువు పెట్టారు. ఓ వైపు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగానే అటు బాంబే స్టాక్ ఎక్సేంజీతో పాటు నిఫ్టీ కూడా నష్టాల దిశగా పయనించడం మొదలైంది. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 120 పాయింట్ల దిగువకు చేరింది.