: అబ్బెబ్బె... ఆ ఆలోచనేమీ లేదు: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కోదండరాం వ్యాఖ్య


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతూ సాగిన మలిదశ ఉద్యమంలో రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీలక భూమిక పోషించారు. రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటానికి ఆయన అనుసరించిన వ్యూహమే ప్రధాన కారణమన్న వాదన కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత... అప్పటిదాకా టీఆర్ఎస్ తో కలిసి నడిచిన కోదండరాం పంథా మార్చారు. అడపాదడపా కేసీఆర్ సర్కారు తీరుపై సునిశిత విమర్శలు చేస్తూ ఆయన ఎప్పటికప్పుడు కలకలం రేపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కోదండరాం...సొంతంగా, కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమన్న వాదనకు బలం చేకూరింది. ప్రస్తుతం ఈ తరహా వార్తలు తెలంగాణ వ్యాప్తంగా జోరందుకున్నాయి. అయితే అలాంటి వార్తల్లో నిజమేమీ లేదని నిన్న స్వయంగా కోదండరాం ప్రకటించారు. నిన్న నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. తన సారథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటవుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన తనకు లేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News