: కాంగ్రెస్ పై విమర్శలతో మొదలైన జైట్లీ బడ్జెట్


గడచిన మూడేళ్లలో భారత వృద్ధి రేటును ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జీడీపీ వృద్ధిని 6 శాతానికి దిగజార్చిందని, గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి రెండేళ్లే అయిందని, భవిష్యత్తులో మేలు చేకూర్చేలా విత్తనాలు నాటుతున్నామని, వీటి ఫలితాలు త్వరలోనే అందుతాయని అన్నారు. కరెంటు ఖాతాల లోటును ఇప్పటికే 18.4 బిలియన్ డాలర్ల నుంచి 14.4 బిలియన్ డాలర్లకు తగ్గించామని గుర్తు చేసిన ఆయన, దీనిని మొత్తం జీడీపీలో 1.4 శాతానికి తీసుకురావడమే ఈ సంవత్సరం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News