: లోక్ సభలో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. 2016-17 సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించకుండా సభ్యులు కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్షాలకు ఇది సరికాదని, బడ్జెట్ ప్రవేశపెట్టనివ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వారిని కోరారు.