: సవాళ్లు పెరుగుతున్నాయి... ఇండియాకు ఇబ్బందే: జైట్లీ


ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో సాగుతున్న వేళ, ఇండియా ముందు ఎన్నో సవాళ్లున్నాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇది ఇండియాకు ఇబ్బందులు కలిగించే సమయమని, ధైర్యంగా ముందుకుసాగాల్సి వుందని అన్నారు. ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కుదేలవుతున్న వేళ, ఇండియా బలంగా ఉందని, ఆర్థిక మందగమనంలో సైతం ముందడుగు వేస్తోందని వివరించారు. ఆర్థిక సంక్షోభ సమయంలో తాను బడ్జెట్ ను తీసుకువచ్చానని అందరి సంక్షేమం కోసం తాను ప్రతిపాదనలు చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News