: సాధారణ బడ్జెట్ కు నవ్యాంధ్ర విన్నపాలు
రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆశిస్తున్న ఏపీ ప్రభుత్వం నేటి సాధారణ బడ్జెట్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ పలు ప్రతిపాదనలు పంపింది. రెవెన్యూ లోటు భర్తీ చేయాలని, రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు, విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరింది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి రాయితీ, పరిశ్రమలకు అన్నిరకాల మినహాయింపులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.4వేల కోట్లు కేటాయించాలని, ఓడరేవుల అభివృద్ధికి నిధులు, జాతీయ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.3,500 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది.