: తమిళనాడులో 'అబ్దుల్ కలాం విజన్ ఇండియా' పార్టీ ఆవిర్భావం
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరు మీదుగా ఆ పార్టీని స్థాపించారు. దీనికి 'అబ్దుల్ కలామ్ విజన్ ఇండియా' పార్టీ అని నామకరణం చేశారు. ఒకప్పుడు కలాంకు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించిన వి.పొన్ రాజ్ ఈ పార్టీ వ్యవస్థాపకుడు. దేశ రాజకీయాల్లో సమూల మార్పును ఆశిస్తున్న యువత, విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు తమ పార్టీ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తుందని పొన్ రాజ్ వివరించారు.