: పీఎఫ్ విత్ డ్రా చేసుకోలేదా? అయితే మీకో శుభవార్త!
ప్రావిడెంట్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోని వారికి శుభవార్త. పీఎఫ్ ఖాతాల్లో ఉన్న క్లయిమ్ చేయని డబ్బుపై వడ్డీని చెల్లించాలని ఈపీఎఫ్ఓ (ది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా, అధికారుల అంచనాల ప్రకారం మొత్తం 8.55 కోట్ల క్లయిములు లేని ఖాతాలు ఉండగా, వాటిల్లో దాదాపు రూ. 30 వేల కోట్లు మూలుగుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పీఎఫ్ జమ చేయడం ఆగిన 36 నెలలలోగా క్లయిములు చేయకుంటే, ఆ ఖాతాలపై వడ్డీలను చెల్లించడం లేదు. ఆ ఖాతా కూడా డెడ్ ఎకౌంట్ అవుతుంది. సాధారణంగా ఉద్యోగులు సంస్థను మారినప్పుడు పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోరు. ఆ తరహా ఖాతాలపై ఏప్రిల్ 1, 2011 నుంచి వడ్డీని ఇవ్వడాన్ని ఆపేశారు. తిరిగి ఇప్పుడు ఆ ఖాతాలపై వడ్డీని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.