: జగన్ జైలుకు... వైసీపీ ఖాళీ తథ్యం: ఏపీ మంత్రి పీతల జోస్యం


ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ నేతల నుంచి వరుస దాడులు ఎదురవుతున్నాయి. నిన్న నెల్లూరు వేదికగా టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి... జగన్ తో పాటు వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీడీపీ మహిళా నేత, ఏపీ కేబినెట్ లో గనుల శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత మైకందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో నేటి ఉదయం కారెం మోహన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని పీతల సుజాత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పిన పీతల, జగన్ పార్టీ వైసీపీ త్వరలోనే ఖాళీ కానుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News