: బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం... పార్లమెంటుకు బయలుదేరిన జైట్లీ


2016-17 బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నేటి ఉదయం తన ఇంటి నుంచి కార్యాలయం చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతులను సిద్ధం చేసుకుని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తర్వాత బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసులో పెట్టుకుని జైట్లీ పార్లమెంటుకు బయలుదేరారు. అదే సమయంలో బడ్జెట్ పుస్తకాలు బ్యాగుల్లో పార్లమెంటుకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News