: ఉత్తమ నటుడు లియొనార్డో డికాప్రియో - ది రెవనెంట్
ఆస్కార్ వేదికపై 'మ్యాడ్ మ్యాక్స్'తో పోటీ పడలేక చేతులెత్తేసిన 'ది రెవనెంట్' కు ఊరట లభించింది. ఈ ఏటి ఉత్తమ నటుడి అవార్డు ' ది రెవనెంట్'లో నటించిన లియొనార్డో డికాప్రియోకు లభించింది. అవార్డుల నామినీలను చదువుతున్న వేళ డికాప్రియో ఆందోళనగా కదలడం కనిపించింది. విజేతగా ఆయన పేరును వెల్లడించగానే ఆడిటోరియం దాదాపు నిమిషం పాటు కేరింతలు కొట్టింది. అంతకుముందు ఉత్తమ నటి అవార్డు 'రూమ్' చిత్రంతో అందరి ప్రశంసలూ అందుకున్న బ్రీ లార్సన్ కు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ గా ది రెవనెంట్ దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ కు దక్కింది.