: హొయలొలుకుతూ వేదికనెక్కిన ప్రియాంకా చోప్రా... 'అండ్ ది అవార్డ్ గోస్ టూ..'!


ఆనందబాష్పాల మార్గరేట్ సిక్సల్ కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా అవార్డును అందించింది. అంతకుముందు ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ చిత్రానికి అవార్డును అందించాల్సిందిగా ఇండియన్ బ్యూటీ క్వీన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రాను ఆహ్వానిస్తున్నామని కార్యక్రమ యాంకర్లు ప్రకటించగానే, ఆహూతుల కరతాళధ్వనుల మధ్య హొయలొలుకుతూ, తనదైన క్యాట్ వాక్ లో ప్రియాంక వేదికపై మెరిసింది. 'అండ్ ది అవార్డ్ గోస్ టూ... మార్గరేట్ సిక్సల్, మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ రోడ్' అనగానే, ఆడిటోరియం మరోసారి చప్పట్లతో మారుమోగింది. అవార్డును అందుకునేందుకు వచ్చిన మార్గరెట్ కళ్లు ఆనందంతో చమర్చగా, ఆమెను ఆలింగనం చేసుకున్న ప్రియాంక అవార్డును అందించింది.

  • Loading...

More Telugu News