: కళ్లు చెదిరే తారల వెలుగు జిలుగుల మధ్య మెరిసిన 'మ్యాడ్ మాక్స్'... తేలిపోయిన 'ది రెవనెంట్'


టైటానిక్ హీరో లియోనార్డ్ డికాప్రియో నటించిన 'ది రెవనెంట్' చిత్రాన్ని, 'మ్యాడ్ మ్యాక్స్: ప్యూరీ రోడ్' వెనక్కు నెట్టేసింది. 12 విభాగాల్లో నామినేషన్ పొందిన రెవనెంట్ కు ఇప్పటివరకూ ఒక్క అవార్డు మాత్రమే దక్కగా, మ్యాడ్ మ్యాక్స్ కు ఏకంగా 9 విభాగాల్లో అవార్డులు లభించాయి. లాస్ ఏంజెల్స్ లో హాలీవుడ్ డాల్బీ థియేటర్ లో ఆస్కార్ ఉత్సవం సాగుతుండగా, నటీ నటులు, కళాకారుల ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకుంటున్నాయి. కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్, హెయిర్‌ స్టయిల్, మేకప్, సౌండ్ ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో మ్యాడ్ మ్యాక్స్ సత్తా చాటింది. ఈ చిత్రానికి దుస్తులను తయారు చేసిన జెన్నీ బీవాన్‌ కు ఆస్కార్ దక్కడం రెండోసారి కావడం గమనార్హం. సినిమాటోగ్రఫీ విభాగంలో మాత్రం రెవనెంట్ కు అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News