: ‘మెలోడ్రామా’ వద్దు!... స్మృతి ఇరానీకి షాకిచ్చిన బీజేపీ అధిష్ఠానం


హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో రిసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా ర్యాలీ, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో నెలకొన్న వివాదంపై బీజేపీ మహిళా నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆమె ఓ పాంప్లెట్ ను చేతబట్టుకుని చేసిన ఉద్వేగభరిత ప్రసంగం నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పడేసింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. స్మృతి ఇరానీ ప్రసంగంపై మోదీ సంతృప్తి వ్యక్తం చేసినా, బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్నే కాక పార్టీని ఇరుకునపెట్టిన ‘మెలోడ్రామా’ ప్రసంగాలు ఇక వద్దంటూ ఆమెకు కాస్తంత గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయా విషయాలపై సభలో మాట్లాడే ముందు పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద పయనీర్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News