: ‘ఆస్కార్’ సందడి షురూ!... లాస్ ఏంజెలిస్ లో వేడుకగా అవార్డుల ప్రకటన


సినీ వినీలాకాశంలో ప్రపంచ స్థాయి అవార్డులుగా పరిగణిస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రకటన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకలో అవార్డుల ప్రకటనను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ వేడుకకు ప్రపంచంలోని అన్ని దేశాల సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నటీనటులు ఈ వేడుకకు తరలివెళ్లారు. అవార్డ్ ప్రెజంటర్ గా గౌరవాన్ని దక్కించుకున్న బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా తెల్లగి సీత్రూ గౌన్ లో మెరిసిపోయింది. ఇక అవార్డుల విషయానికి వస్తే... ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ‘స్పాట్ లైట్’ కైవసం చేసుకోగా, ఉత్తమ సహాయ నటిగా అలీసియా వికందర్ (ద డానిష్ గర్ల్) చేజిక్కించుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జెన్నీ బీవన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్) ఎగురేసుకెళ్లారు. ఇక బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్’ అవార్డులను చేజిక్కించుకుంది.

  • Loading...

More Telugu News