: భాగ్యనగరి శివారులో రేవ్ పార్టీ... అంకుల్స్ సహా డ్యాన్సర్లను అరెస్ట్ చేసిన ఎస్ వోటీ పోలీసులు
రెండేళ్ల క్రితం వరకు భాగ్యనగరి హైదరాబాదును రేవ్ పార్టీలు ముంచెత్తాయి. పోలీసుల కఠిన వైఖరి నేపథ్యంలో ఇటీవలి కాలంలో వీటి సంఖ్య తగ్గినా, మళ్లీ చిన్నగా ఈ పాశ్చాత్య సంస్కృతి జడలు విప్పుతోంది. ఇటీవలే సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు రేవ్ పార్టీలో మునిగి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా వయసు మీద పడ్డ కొంతమంది అంకుల్స్ అమ్మాయిల అసభ్యకర డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు మెరుపు దాడి చేసి అంకుల్స్ సహా డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. నగర శివారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఐదుగురు అమ్మాయిలు, 10 మంది దాకా అంకుల్స్, ముగ్గురు నిర్వాహకులు ఉన్నారు.