: సీఎం కేసీఆర్ ను కలిసిన ఒవైసీ సోదరులు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కలిశారు. హైదరాబాదులో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు వివరించామని అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరామని అన్నారు. బడ్జెట్ లో మైనారిటీలకు 2 కోట్ల నిధులు పెంచాలని కోరామని వారు చెప్పారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 70 మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News