: చిన్నప్పుడు ఏదో పెళ్లికి వెళ్లి ఉంటాను...అందుకే పెళ్లి కథల చుట్టూ తిరుగుతున్నాను: నందినీ రెడ్డి


చిన్నప్పుడు ఏదో పెళ్లికి వెళ్లి ఉంటానని, ఆ జ్ఞాపకాల వల్లే ఇప్పుడు పెళ్లి కథల చుట్టూ తిరుగుతున్నానని ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి చమత్కరించింది. 'కళ్యాణ వైభోగమే' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ టీవీ చానెల్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా, తన సినిమాల్లో కథ ఎక్కువగా పెళ్లి వాతావరణం చుట్టూతా తిరగడానికి కారణం అడిగినప్పుడు ఆమె అలా స్పందించింది. 'అలా మొదలైంది' సినిమాతో సక్సెస్ చూసినప్పటికీ, 'జబర్దస్త్' అట్టర్ ఫ్లాప్ కావడంతో తనకు అవకాశాలు కరవయ్యాయని, అందుకే చాలా గ్యాప్ తరువాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని నందినీ రెడ్డి చెప్పింది. సినిమాను ఆహ్లాదకర వాతావరణంలో, అద్భుతమైన కథతో రూపొందించానని చెప్పింది. 'అలా మొదలైంది' సినిమా కంటే ముందే ఈ కథను రాసుకున్నానని తెలిపింది. సినిమాపై నమ్మకం ఉందని, ప్రేక్షకులను అలరిస్తుందని నందినీ రెడ్డి భరోసా ఇచ్చింది.

  • Loading...

More Telugu News