: నూతన ఆవిష్కరణ... గాలిబుడగపై తేలియాడే సోలార్ ప్యానెల్


గాలి బుడగలపై తేలియాడే అత్యంత సన్నని, తేలికైన ఫోటో వోల్టాయిక్ సెల్స్ (సోలార్ ప్యానెల్) ను అమెరికాలోని ఎంఐటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వెంట్రుకలో 50వ వంతు ఉండే వీటిని హీలియం బుడగలు, స్మార్ట్ దుస్తులపై కూడా పెట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త వ్లాదిమిర్ బునోవిక్ మాట్లాడుతూ, నోట్ బుక్, స్మార్ట్ చొక్కాలలో ఎక్కడ పెట్టామో కూడా గుర్తించలేనంతగా ఇవి ఉంటాయని అన్నారు. ఇంతటితో పరిశోధన పూర్తి కాలేదని, మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సౌరకణము, ఉపరితలాన్ని కలిపి వీటిని తయారు చేయడం వల్ల, దుమ్ముధూళి నుంచి రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. భారీ ప్యానెల్స్ తరహాలో కాకుండా ఓ చిన్న గదిలో రసాయనాలు వాడకుండా దీనిని తయారు చేసినట్టు ఆయన చెప్పారు. తేలికగా, సన్నగా ఉన్నప్పటికీ సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడంలో ఇది విశేషంగా పని చేస్తుందని ఆయన తెలిపారు. బరువుకు ప్రాధాన్యమున్న అంతరిక్షంలో ఇది విశేషమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News