: రాష్ట్రాలన్నీ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి: మోదీ
దేశంలోని రాష్ట్రాలన్నీ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో నిర్వహించిన కిసాన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుందేల్ ఖండ్ లో ఐదు నదులు ప్రవహిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు తాగునీటికి కటకటలాడడం దురదృష్టకరమని అన్నారు. యూపీ సహా ఇతర రాష్ట్రాలన్నీ వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగంలో ఉపాధిహామీ పధకం అమలు చేయాలని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం ఇప్పటికి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. రైతుల ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని అవకాశాలుగా చేసుకోవాలని ఆయన వారికి హితవు పలికారు.