: నేను వీడియో మాత్రమే తీశాను... 'వీణవంక' అత్యాచారం నిందితుడు
వీణవంక అత్యాచార ఘటనలో మూడో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను నిర్దోషినని చెప్పాడు. తాను అత్యాచారంలో పాల్గొనలేదని, వీడియో మాత్రమే తీశానని పేర్కొన్నాడు. తాను నిందితులను పట్టించానని, ఈ ఘటనలో తన ప్రమేయం లేదని చెప్పాడు. అత్యాచారం చేయమని ఎందుకు ప్రోత్సహించావని ప్రశ్నించడంతో మౌనం వహించాడు. తాను వారిని అలా చేయవద్దని చెప్పానని, అయినా వారు తన మాట వినలేదని అన్నాడు. తాను దోషినో, కాదో ఇంకొంత కాలం ఆగితే తెలుస్తుందని చెప్పాడు. కాగా, యువతి అత్యాచారం ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఈ మూడో వ్యక్తిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.