: భారత్ పై అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్
లోకల్ నినాదంతో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై అక్కసును వెళ్లగక్కారు. తాజాగా, ఆయన మాట్లాడుతూ, భారత్ లాంటి దేశాలు అమెరికన్ యువతకు ఉద్యోగాలు దక్కనీయకుండా చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికన్ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు వారిని వెళ్లగొడతామని అన్నారు. దేశంలో ఉన్న ఉద్యోగాల్లో చాలా భాగం భారత్, చైనా, జపాన్, మెక్సికో వంటి దేశాలకు చెందినవారు చేజిక్కించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ఉద్యోగాలను అమెరికన్లకు దక్కేలా చేసి, అమెరికాను అగ్రస్థానానికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. అవసరమైతే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడకట్టిస్తామని ఆయన పేర్కొన్నారు.