: ఖలీద్ తో పాటు ఎంపీ రాజా కుమార్తెకు నిబంధనలకు విరుద్ధంగా జేఎన్యూ హాస్టల్ లో ప్రవేశం!


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఉదంతానికి కొత్త ట్విస్ట్. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన ఉమర్ ఖలీద్ తో పాటు రాజ్యసభ ఎంపీ, సీపీఐ నేత డీ రాజా కుమార్తె అపరాజితలకు నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ సౌకర్యాన్ని కల్పించారని అధికారులు గుర్తించారు. ఓ పీహెచ్డీ విద్యార్థిగా, ఉమర్ ఖలీద్ వర్శిటీలోని తాప్తి హాస్టల్ రూం నెంబర్ 168లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు దక్షిణ ఢిల్లీలోని జకీర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం హాస్టళ్లను ప్రాధాన్యతలుగా విభజించి కేటాయించాలి. తొలి ప్రాధాన్యతలో ఫుల్ టైం ప్రోగ్రామర్లుగా చేరే, ఢిల్లీ బయటి ప్రాంతాల వారికి, ఆపై డిగ్రీ కలిగివుండి, జేఎన్యూలో ప్రోగ్రామ్ ల కోసం వచ్చే బయటి ప్రాంతాల వారికి, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ చేస్తున్న స్థానిక విద్యార్థులకు కేటాయించాలి. ఢిల్లీలో నివసిస్తున్న వారి పిల్లలకు హాస్టల్ సౌకర్యం ఉండకూడదు. కానీ క్యాంపస్ లోని గదిని ఖలీద్ కు ఎలా కేటాయించారన్న విషయమై ఇప్పుడు అధికారులు విచారిస్తున్నారు. హాస్టల్ లో అద్దె రూ. 120 నుంచి రూ. 240 వరకూ మాత్రమే ఉంటుంది. హాస్టల్ లో మొత్తం 5,500 గదులు ఉండగా, వాటిల్లో ఎక్కువగా ఢిల్లీ వాసులే ఉంటున్నారని, బయటి వారు వర్శిటీ సమీపంలోని మునిర్కా, బెర్ సరాయ్ ప్రాంతాల్లో వేలాది రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారని అధికారులు గుర్తించారు. తమ విచారణలో భాగంగా ఎంపీ కుమార్తెకు సైతం నిబంధనలకు విరుద్ధంగా గది కేటాయించినట్టు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News