: క్యూలో మరింతమంది... వైకాపా పని అయిపోయినట్టే: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అన్న పదం కూడా వినపడని రోజు త్వరలో రానుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నుంచి మరింత మంది తెలుగుదేశం పార్టీలోకి వస్తామని సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించిన ఆయన, వైకాపాను మరో పార్టీలో విలీనం చేయడం మినహా మరో మార్గం జగన్ ముందు కనిపించడం లేదని అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే తమ పార్టీలోకి వస్తున్నారే తప్ప తామెలాంటి ప్రలోభాలకూ గురి చేయడం లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి వైకాపా పూర్తిగా కనుమరుగవుతుందని అభిప్రాయపడ్డారు.