: అమేజింగ్ ఫోన్... ఇదే ల్యాప్ టాప్, కంప్యూటర్ కూడా!


ల్యాప్ టాప్ గా, కంప్యూటర్ గా పనిచేసే సరికొత్త స్మార్ట్ ఫోన్ 'ఎలైట్ ఎక్స్ 3'ని హెచ్పీ సంస్థ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఆధారంగా పనిచేసే ఫోన్ 6 అంగుళాల స్క్రీన్ ను కలిగివుంటుంది. ఐపీ67 సర్టిఫికేషన్ పొందిన ఈ మొబైల్, నీళ్లలో ఒక మీటర్ లోతున 30 నిమిషాల పాటు ఉన్నా, ఏమాత్రం పాడుకాదని హెచ్పీ ప్రతినిధులు వివరించారు. ఈ ఫోన్ కు మౌస్ లేదా ప్రింటర్, మానిటర్ వంటి వాటిని ఎటాచ్ చేసుకోవచ్చని తెలిపారు. గొరిల్లా గ్లాస్, స్నాప్ డ్రాగన్ 2.15 జీహెచ్ ప్రాసెసర్, 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్, 4,150 ఎంఏహచ్ బ్యాటరీ తదితర సదుపాయాలుంటాయని, దీన్ని సాధ్యమైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకువస్తామని సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News