: ఏడాదిలో ఆ ఒక్క నగరంలోనే 1065 మందిని చంపాం: ఐఎస్ఐఎస్
గత సంవత్సరంలో ఒక్క మోసూల్ నగరంలో వివిధ కారణాల రీత్యా 1065 మందిని చంపేసినట్టు చెప్పుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వారి వివరాలతో కూడిన జాబితాను షరియా కోర్టు ఆవరణలో ఉంచింది. వీరంతా ఖలీఫా సామ్రాజ్యాన్ని వ్యతిరేకించారని ఉగ్రవాద వర్గాలు వెల్లడించాయి. మోసూల్ లో వందలాది మంది అదృశ్యం కావడంతో, మరణశిక్షలు పడ్డ వారిలో తమవారేమైనా ఉన్నారా? అన్న ఆందోళనతో ప్రజలు ఈ జాబితాలను చూసుకుంటున్నారు. కాగా, ఐఎస్ఐఎస్ కోర్టులు అతిచిన్న తప్పులకు సైతం మరణశిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విదేశీ సంగీతం వింటున్నాడన్న ఆరోపణతో ఓ మైనర్ బాలుడిని నడిరోడ్డుపై తల నరికి చంపిన సంగతి తెలిసిందే.