: బాహుబలి సెట్లో ముగ్గురు సైనికులం!: రాజమౌళి
బాహుబలి రెండో భాగాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న రాజమౌళి, తనతో పాటు చిత్ర నిర్మాణంలో భాగమైన కేకే సెంథిల్ కుమార్, పీట్ డ్రాపర్ లతో కలసి దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. "బాహుబలి సెట్ లో ముగ్గురు సైనికులు" అంటూ ట్యాగ్ లైన్ ను కూడా పెట్టారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోందని చెప్పారు. కాగా, గత సంవత్సరం విడుదలైన బాహుబలి తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించగా, దానికి కొనసాగింపుగా వస్తున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. నటుడు సుబ్బరాజు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, సుబ్బరాజు వీడియోను కూడా బాహుబలి టీం పోస్ట్ చేసింది.